Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ హయాంలో అన్ని విభాగాల్లో అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కోల్ ముంతల్ పహాడ్‌లో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు గురువారం మంత్రితో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. కులమతాల మధ్య అంతరం తొలగించేందుకే రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు.
రూ.13,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని.. త్వరలోనే రోడ్డు పనులన్నీ ప్రారంభిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దేవరకొండకు రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎల్ఓసీలు 24 గంటల్లోనే అప్రూవల్ ఇస్తున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసి దేవరకొండ, మునుగోడును సస్యశ్యామలం చేస్తామని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాకు వచ్చే నిధుల్లో దేవరకొండకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌కు మంత్రి సూచించారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>