కలం, వరంగల్ బ్యూరో : హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గ్రామంలో పర్యటించి, ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించారు.
అనంతరం స్థానిక ప్రజలు, రైతులతో నేరుగా ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

