Mobile Popup Ad
Mobile Popup Ad

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్ నుండి కరీంనగర్‌కు వెళ్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) మార్గమధ్యంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలను (MGNREGA Workers) కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల పురోగతి, పనుల నిర్వహణ విధానం, వేతనాల చెల్లింపులు, పని పరిస్థితులు వంటి అంశాలపై కూలీలతో మంత్రి మాట్లాడారు.

పనులు జరుగుతున్న ప్రదేశాలను స్వయంగా పరిశీలించిన ఆయన, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కూలీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకం సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>