Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి పొంగులేటి

కలం, వరంగల్ బ్యూరో: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. మంగళవారం హనుమకొండ (Hanumakonda)లోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses), 2 బీహెచ్‌కే గృహాల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఖాజీపేట మండలంలోని న్యూ షాయంపేటలో నూతనంగా నిర్మించిన 2బీహెచ్‌కే గృహ సముదాయాన్ని పొంగులేటి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేసి కానుకలు అందజేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గృహ సముదాయ ప్రాంగణంలో మొక్క నాటి నీరు పోశారు. కాళోజి కళాక్షేత్రంలో లబ్ధిదారులకు గృహ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, రూ.22,500 కోట్ల వ్యయంతో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని, గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో మధ్యలో నిలిచిపోయిన సందర్భాలను గుర్తించి, వాటి పూర్తి నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి.అజీజ్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేష్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈ రవీందర్, అదనపు కమిషనర్ జోనా, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>