కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) గైర్హాజరు అయ్యారు. యాదగురిగుట్ట పాలకమండలి విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు గత రెండు రోజులుగా అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే పాలకమండలి ఛైర్మన్, సభ్యులను నిర్ణయించి ప్రకటించడంతో సురేఖ కినుక వహించినట్లు చెబుతున్నారు. అందుకే, మంత్రి వర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ఊహాగానాలొస్తున్నాయి.
విదేశాల నుంచి వచ్చినా..
యాదగిరిగుట్ట పాలకమండలిని ప్రకటించిన సమయంలో కొండా సురేఖ విదేశాల్లో ఉన్నారు. ఆమెకు సంబంధం లేకుండానే ఛైర్మన్, సభ్యులను ప్రకటించడంపై అసహనంగా ఉన్నట్లు జోరుగా వార్తలొస్తున్నాయి. ఈ రోజు ఆమె విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చినా, మంత్రి వర్గ భేటీకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ గైర్హాజరుకి యాదగురిగుట్ట అంశమే కారణమా.. లేకపోతే మరేదైనా సమస్య ఉందా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది

