Mobile Popup Ad
Mobile Popup Ad

మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి సీఎంఎస్ కేంద్రాలు : దామోదర రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్ : మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, CURE ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 2 CMS కేంద్రాలకు అదనంగా మరో 4 కొత్త CMS కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarasimha) ఆదేశించారు. హైదరాబాదులోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (TGMSIDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) ల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (CMS) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఎంసిడీసీ అధికారులను ఆదేశించారు.

సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, సర్జికల్స్, రీజెంట్స్, ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు చేస్తున్న టెండర్లను పారదర్శకంగా ఉండేలా విధివిధానాలను రూపొందించాలని మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. టెండర్లలో పారదర్శకతను మరింత పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 2 కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను కొత్తగా ఏర్పాటు చేసి, మొత్తం 5 కమిటీలను నియమించాలన్నారు. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆస్పత్రులలో TGMSIDC ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్‌మెంట్స్, సివిల్ వర్క్స్ లను రెగ్యులర్ గా పర్యవేక్షించడానికి తక్షణమే నోడల్ ఆఫీసర్స్ ను నియమించాలని ఆదేశించారు.

TGMSIDC లో టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న మందులు, ఎక్విప్‌మెంట్, సర్జికల్, రీజెంట్స్ లను నెలవారీగా, విధిగా సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. అన్ని స్థాయుల ఆస్పత్రులకు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు) అవసరమైన ఎక్విప్‌మెంట్ కు సంబంధించి ఒక ప్రామాణిక జాబితాను తయారు చేసి, నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో TGMSIDC కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ ఉప్పల్, కార్పొరేషన్ అధికారులు ED ఇంచార్జి వెంకటేశ్వర్లు, సంస్థ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>