కలం మెదక్ బ్యూరో: ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టామని, త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి దామోదర రాజనర్మింహ (Minister Damodar Raja Narasimha) తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని బాలసదనంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌తో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్రంలో అంగన్వాడీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. పిల్లలకు విద్య అందించడంతోపాటు పోషకాహారం, ఆరోగ్యం, ప్రీ-స్కూలు, రోగ నిరోధకత, రిఫరల్ సేవలు, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య, మహిళా సాధికారత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

