నల్లగొండను మొదటి స్థానంలో నిలపాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కలం, నల్లగొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇంఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) తెలిపారు. శనివారం నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక (Praja Palana – Pragathi Pranalika)పై నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.  ప్రభుత్వ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించవద్దని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలుపట్ల నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు.

ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఆయా షెడ్యూల్ తేదీల వారీగా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు అందరూ బాధ్యతతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వాట్సాప్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, అలాగే జిల్లా కలెక్టర్లు సైతం కార్యక్రమాన్ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని, ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఆ రోజు నివేదిక రూపంలో రూపొందించాలని చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>