రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది.. గవర్నర్ జిష్ణు దేవ్‌తో భట్టి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించి, మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మను శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) అందించిన సహకారం, మార్గదర్శకత్వం మరువలేనిదని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలన్నారు. బాధ్యతాయుతమైన పదవి నుంచి మరో కీలక పదవికి వెళ్తున్న ఆయనకు, రాష్ట్ర ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>