కొత్త పింఛన్ల మంజూరు ఘనత ప్రజా ప్రభుత్వానిదే : మంత్రి అడ్లూరి

కలం, ధర్మారం: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు (Cheyutha Pensions) అందజేస్తామని, కొత్త పింఛన్ల పంపిణీ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వానిది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ప్రోసిడింగ్ లతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇందిరా బీమా పథకాన్ని మంత్రి ధర్మారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 200 యూనిట్లకు పేదల తరుపున ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులకు రేషన్ కార్డులు అందజేయడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత పింఛను అందించి అండగా నిలవాలని ఉద్దేశంతో కొత్త పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. ధర్మారం మండలానికి కొత్తగా 690 చేయూత పింఛన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారిని గుర్తించి పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ధర్మారం మండలానికి 648 ఇందిర ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల ను అందజేస్తామని మంత్రి తెలిపారు. ధర్మారం మండల అభివృద్ధి కి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2006 నుండి ధర్మారం మండల ప్రజలు తనకు అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయడంతో పాటు మేడారం గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వ కాలంలో నేనే రాజును మేమే మంత్రులం అని చెప్పుకున్న నాయకులు చామనపల్లి గ్రామ సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. చామనపల్లి గ్రామాన్ని 100% ముంపు గ్రామంలో తీసుకొని వారికి రూ. 350 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమని మంత్రి తెలిపారు.

ధర్మారం మండలంలోని 32 మహిళా సంఘాలకు మహిళా సంఘాల భవనాలు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండలం సర్పంచులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>