కలం, సినిమా : టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం (Percentage Dispute) పరిష్కార దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ సమస్యలను స్వయంగా వినేందుకు చిరంజీవి సమయం కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండస్ట్రీలో నెలకొన్న ఈ వివాదానికి చిరంజీవి జోక్యంతో పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశం అనంతరం పర్సంటేజ్ విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

