ఢిల్లీ పెద్దలతో చర్చల తర్వాతే రాజీనామా నిర్ణయం!: బీజేపీ ఎమ్మెల్యే

కలం, వెబ్ డెస్క్ :  జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) మరోసారి తన రాజీనామా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న సమన్వయ లోపాలపై తాను ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వానికి రాతపూర్వకంగా సమగ్ర నివేదిక అందించినట్లు వెల్లడించారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత ఢిల్లీ పెద్దల నుంచి తనకు పిలుపు వస్తుందని, ఆ తర్వాత రాజీనామా అంశంపై స్పష్టతనిస్తానని చెప్పుకొచ్చారు.

కాగా, కడప జెడ్పీ ఛైర్మన్ పదవిని తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డికి ఇస్తామని తొలుత చెప్పి, చివరి నిమిషంలో ఆ పదవిని టీడీపీ నేతకు కేటాయించారని ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాకు సిద్ధమయ్యానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారులు ఇద్దరు ఇప్పటికే తమ జెడ్పీటీసీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఆదినారాయణ రెడ్డిని బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే విజయవాడలో ఆయనతో చర్చలు జరిపారు. దీంతో అందరి దృష్టి డిసెంబర్ 5 తర్వాత జరగబోయే ఆదినారాయణ రెడ్డి డిల్లీ పర్యటనపై నిలిచింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>