కలం, కరీంనగర్ : కాకా వెంకటస్వామి నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి, పార్లమెంటరీ వ్యవస్థలో ఢిల్లీ రాజకీయాలను శాసించిన గొప్ప నాయకుడు అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipalli Satyam) కొనియాడారు. దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కాకా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సత్యం (Medipalli Satyam) మాట్లాడుతూ.. 1960, 70ల దశకంలో హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో పేదలకు, ఇల్లు లేని వారికి గుడిసెలు వేయించి ‘గుడిసెల వెంకటస్వామి’గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి, వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించారని, అక్కడ చదువుకున్న వారు నేడు IAS, IPSలుగా, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారని వెల్లడించారు. వెంకటస్వామి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కర్ర సత్య ప్రసన్నారెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, బానోతు శ్రావణ్ నాయక్, కల్వల రాంచందర్, వరాల నర్సింగం, శుకూర్, సరిల్ల రతన్ రాజు, విక్టర్,కొలగాని అనిల్, అనంతుల రమేష్, మాదాసు శ్రీనివాస్, కుర్ర పోచయ్య, మాలోతు మహాలక్ష్మి, జొన్నల రమేష్, చింతల కిషన్, మూల జైపాల్, స్వప్నశ్రీ, శిల్ప, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంగనాయక, వీర దేవేందర్, పెంట శేఖర్, అందే శంకర్, తదితరులు పాల్గొన్నారు.

