ఆదిలాబాద్‌కు చేరుకున్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి

కలం, ఆదిలాబాద్ :  మీడియా ప్రతినిధులకు అక్టోబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  శ్రీనివాస్‌రెడ్డి (Sreenivas Reddy) బుధవారం రాత్రి ఆదిలాబాద్(Adilabad) జిల్లా కేంద్రంలోని పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీపీఆర్వో విష్ణువర్ధన్‌తో పాటు పలువురు మీడియా ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

రెండు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్ మీడియా పరిణామాలు, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదల తదితర అంశాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ వార్తా సేకరణ, ప్రసారంలో ఎదురవుతున్న సవాళ్లపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>