కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లో ఆర్టీఐ పేరిట బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన ఇద్దరిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 30 న ఇద్దరు వ్యక్తులు మహిళా శక్తి క్యాంటీన్‌కి వచ్చి టీ తాగారు. అనంతరం క్యాంటీన్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని, కిచెన్ పరిశుభ్రంగా లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బెదిరించి నిర్వాహకుల నుంచి రూ.30 వేలు డిమాండ్ చేశారు. క్యాంటీన్ నిర్వాహకులు రూ.15 వేలు ఇచ్చారు. దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

