కలం, ములుగు: సమ్మక్క–సారలమ్మ మేడారం మినీ జాతర (Medaram Mini Jatara)ను 2027 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర తేదీలను ప్రకటిస్తూ ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17న బుధవారం, 18న గురువారం, 19న శుక్రవారం, 20న శనివారం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు పూజారుల సంఘం తరఫున తేదీలను ప్రకటించినట్లు వెల్లడించారు.

