కలం మెదక్ బ్యూరో : వేసవి కాలం వచ్చిందంటే కాలనీలలో కుళాయిల దగ్గర బిందెలతో నీళ్ళ కోసం జనాల గొడవలు చూసాం. సేమ్ అదే స్టైల్ లో మెదక్ (Medak) మున్సిపల్ సమావేశంలో వాటర్ ట్యాంకర్‌ల కోసం కౌన్సిలర్లు గొడవకు దిగారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లోనే వాటర్ ట్యాంకర్‌లు సరఫరా చేస్తున్నారని.. తమ వార్డులకు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్(BRS) కౌన్సిలర్లు ఆరోపించారు. మీకు కూడా ట్యాంకర్లు వచ్చాయంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ వ్యాఖ్యలను ఖండించారు.
వాటర్ ట్యాంకర్ల మీద సుమారు 20 నిమిషాల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాడి వేడి వాగ్వాదం నడిచింది. ట్యాంకర్‌ల పంచాయతీ చూసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ (Mynampally Rohit), గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు నీటి సరఫరా అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా మెదక్ మున్సిపాలిటీని (Medak Municipality) అభివృద్ధి చేస్తామని చెప్పి కౌన్సిలర్లకు సర్దిచెప్పడంతో నీళ్ల ట్యాంకర్ల వివాదం సద్దుమణిగింది.
Read Also: ఏమన్నా స్పందించను: వేం నరేందర్ రెడ్డి
Follow Us On: Facebook

