మెద‌క్ లో జ‌ల‌గండం .. 20 మంది మృత్యువాత!

కలం, మెదక్ బ్యూరో : వేసవికాలంలో ఈత స‌ర‌దా ఉమ్మ‌డి మెద‌క్ (Medak) జిల్లాలోని ప‌లు కుటుంబాల్లో విషాదంను మిలుగుల్చుతున్నది. ఏదో ఒక చోట నీట మునిగి ప్రాణాలకు కోల్పొవ‌డం అందోళ‌న‌ను క‌ల్గిస్తున్నాయి. ఈ వేస‌వి లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా 20 మంది వ‌ర‌కు చ‌నిపోయారు. ఈ జ‌ల‌గండం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర‌విషాదంను మిలుగుల్చుతున్న‌వి. గ‌త మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 10 మంది వ‌ర‌కు నీట మునిగి చ‌నిపోవ‌డం ప‌రిస్ధితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతుంది. మంగ‌ళ‌వారం రోజున సంగారెడ్డి జిల్లా కంగ్టి మండ‌లం బోర్గి తండాలో బ‌ట్ట‌లు ఉత‌క‌డానికి వెళ్లి ప్ర‌మాదవ‌శాత్తు బావిలో ప‌డి ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు మ్ర‌తి చెందారు. ఈ రోజు సిద్ధిపేట జిల్లా వ‌ర్గ‌ల్ మండ‌లం నాచారం హ‌ల్డీ వాగులో గ‌ల్లంతై ముగ్గ‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయారు. మెద‌క్ మండ‌లం పిల్లి కొట్టాల్ శివారులోని ఓ కుంటలో ప‌డి తండ్రి కొడుకు ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మ‌రో వేరు వేరు ప్ర‌మాదంలో ఇద్ద‌రు చ‌నిపోయారు. ఇలా మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే 10 మంది వ‌ర‌కు నీట మునిగి చ‌నిపోవ‌డం ప‌రిస్ధితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతుంది.

ప్ర‌మాద కేంద్రాలుగా గ్రామీణ ప్రాంతాలు

వేస‌వి సెల‌వులతో పాటు , ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఉప‌శ‌మ‌నం కోసం యువ‌కులు ,పిల్లలు స్ధానికంగా ఉన్న స‌హ‌జ జ‌ల‌వ‌న‌రుల వ‌ద్ద‌కు ఈత‌కు వెళ్తారు. ఉమ్మ‌డి మెదక్ జిల్లాలోని రంగ‌నాయ‌క్ సాగ‌ర్ , కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ , మ‌ల్ల‌న్న సాగ‌ర్ , ఏడుపాయ‌ల , సింగూరు ప్రాజెక్టులు వాటి కింద‌ కెనాల్స్, హ‌ల్డీ వాగు ,కూడ‌వెల్లి వాగు, మంజీరా న‌ది ప‌రివాహ ప్రాంత‌లు ఉన్నాయి. వీటితో పాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల వద్ద ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. సరదా కోసం వేసవిలో ఈతకు వెళ్లే పిల్లలకు నీటి లోతు తెలియకపోవడం వల్ల వారు జారి నీటిలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు క‌లిసి వెళ్లిన వాళ్ల‌లో ఒక‌రు గ‌ల్లంతు కాగానే ,వారిని కాపాడే ప్ర‌యత్నంలో మిగిలిన వారు సైతం మునిగి చ‌నిపోతున్న సంఘ‌ట‌నలు ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఒక‌రిని ర‌క్షించ‌బోయి మ‌రొక‌రు .. త‌మ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి ప్ర‌య‌త్నం చేస్తూ …త‌మ ప్రాణాలను కోల్పొతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వేసవి కాలంలో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ ప్రాంతాల్లో సుమారు 20 మంది వ‌రకు మృత్యువాత పడి వారి కుటుంబాలకు తీరని శోకమును మిగిల్చారు.

త‌ల్లిదండ్రుల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ఈత సరదా తల్లిదండ్రులకు, బంధువులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతుంది. ఎక్కువ‌గా యువ‌కులు, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈత సరదా ప్రమాదంగా మారి ప్రాణాల మీద‌కు వ‌చ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అంద‌రి భాధ్య‌త‌. పెద్ద‌లు లేకుండా చుట్టు పక్కల పిల్లలతో పాటు ఈతకు పంపవద్దు. ముఖ్యంగా గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు, పెద్దల పర్యవేక్షించ‌డం ద్వారా ప్రమాదాలను కొంత‌వ‌ర‌కైన‌ నివారించవచ్చును. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఎక్కువగా ఈతకు వెళ్లే ప్రాంతాలు చెరువులు, వ్యవసాయ బావుల.. ఇతర ప్రాంతాలను గుర్తించి రక్షణగా చర్యలు తీసుకోవాలి.

పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు శివారు గ్రామాల్లో, ప్రాజెక్టుల పరివాహ ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. స్మిమ్మింగ్ నేర్చుకొనే క్రమంలో పిల్లలకు స్విమ్మింగ్ ట్యూబ్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. భ‌ద్ర‌త విష‌యంలో ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించిన కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలను కోల్పొవ‌ల‌సి వ‌స్తుంది. పోలిసుల సైతం ప్రాజెక్టులు , ప్ర‌మాద‌లు జరుగుతున్న ప్రాంతాల‌ను గుర్తించి ..వాటి వ‌ద్ద ప్ర‌మాద‌ హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు, పెట్రోలింగ్ చేయవలసిన అవ‌స‌రం ఉన్న‌ది. వేస‌విలో మెద‌క్ జిల్లాలో పెద్దఎత్తున ఈత స‌ర‌దా వ‌ల‌న ప్రాణాలు కోల్పొతున్న నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు అవగాహన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాలి. త‌ల్లిదండ్రులు , గ్రామ‌స్తులు, పోలీసులు స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తే చాల‌మంది పిల్ల‌ల ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చును.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>