కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ అల్కాపూరి కాలనీ బైపాస్ రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ (ISKCON Temple) ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రాధ గోవింద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ సందర్శన సందర్భంగా అక్కడ ఉన్న ఇస్కాన్ బాధ్యులు ఆలయ పరిసరాలలో ఎదురవుతున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఆలయ సమీపంలో పేరుకుపోతున్న డ్రైనేజీ నీటికి సంబంధించిన సమస్యను, దాని వల్ల ఆలయ నిర్వహణకు, అలాగే నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. ఈ సమస్యపై వారు సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఆలయ పరిసరాల్లో డ్రైనేజీ నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడిశెట్టి వసంత లక్ష్మీ- భూమయ్య, ఇస్కాన్ ఆలయ బాధ్యులు ప్రభుజీ, రాజభాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, తదితర నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

