కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని టోలీచౌకి (Tolichowki)లో శనివారం తెల్లవారుజామున ఓ టైర్ల దుకాణం (Tyre Shop)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ పవర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే మంటలు అంటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

