Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) అంబర్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 6 నెంబర్ చౌరస్తాలోని రెనాల్ట్ మహేంద్ర షోరూంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే.. ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. టైర్ల గోదాంలో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్పేయడం కష్టంగా మారింది. దట్టమైన పొగ ఆవహించడంతో చుట్టు పక్కల ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా, పోలీసులు వారిని దూర ప్రాంతానికి తరలించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>