కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వమే అసెంబ్లీ విధివిధానాలు, సభా నిబంధనలను రూపొందించిందని, వారు చేసిన నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సభలో ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని, రూల్స్ ఉల్లంఘిస్తే ఎవరినీ లోపలికి అనుమతించరని చెప్పారు.
పార్లమెంట్ నియమావళి ప్రకారం నల్ల టీషర్ట్, స్లోగన్లతో వెళ్లేందుకు అవకాశం ఉన్నందుకే రాహుల్ గాంధీని అనుమతించారని, కానీ తెలంగాణ అసెంబ్లీ నిబంధనల్లో నల్ల రంగు టీషర్టుపై స్లోగన్లు వేసుకుని రాకూడదనే స్పష్టమైన నియమం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే సభలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రానివ్వలేదని చెప్పారు.
నిజాం పాలన అద్భుతం..
పాలనాధికారుల్లో నిజాం ఉత్తమ పరిపాలకుడని సీఎం ప్రశంసించారు. 200 ఏళ్లకు పైగా సాగిన పాలనలో చివరి 10 నుంచి 12 ఏళ్ల రజాకార్ల కాలాన్ని మినహాయిస్తే నిజాం సర్కార్ అద్భుతమైన పరిపాలన అందించిందని వ్యాఖ్యానించారు. అలాగే నిషేధిత భూముల సమస్యను ఒక భూతంగా చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి మనిషి కావడం వల్లే ఈ కక్షపూరిత ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఎంత బాధ్యుడో, ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
Also Read : చరిత్రను దాచేస్తే దాగదు.. తెలంగాణ పోరాటంపై ఈటల కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

