‘ధరణి’ పేరుతో వేల ఎకరాల దోపిడీ: సీఎం సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ధరణి పోర్టల్, 22A నిషేధిత భూముల జాబితా ఆధారంగా తెలంగాణలో భూ కుంభకోణాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్(Dharani Portal), 22A నిషేధిత భూముల (22A Lands) జాబితాను అడ్డుపెట్టుకుని కొన్ని కుటుంబాలు అక్రమాలకు పాల్పడ్డాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ ఆధారంగా వేలాది ఎకరాల భూములను, లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, రైతుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఈ భూ దందాకు సంబంధించిన పూర్తి ఆధారాలు, రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, వాటన్నింటినీ శాసనసభ వేదికగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 22A జాబితా వల్ల బాధితులుగా మారిన నిజమైన ఆస్తిపరులకు, రైతులకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం, న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. పొరపాటున 22A పరిధిలోకి వచ్చిన భూములను క్రమబద్ధీకరించడం లేదా జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తెచ్చి శిక్షిస్తామని ఆయన (Revanth Reddy) వెల్లడించారు.

Also Read : చరిత్రను దాచేస్తే దాగదు.. తెలంగాణ పోరాటంపై ఈటల కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>