అల్లు అర్జున్ ఇచ్చిన సలహాతోనే హ్యాపీగా పెళ్లి చేసుకున్నా : శిరీష్

కలం, వెబ్ డెస్క్ : అల్లు శిరీష్ (Allu Sirish) రీసెంట్ గానే ఓ ఇంటివాడు అయ్యాడు. తాను ప్రేమించిన నయనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శిరీష్‌.. నయనిక తనకు అన్ని విధాలుగా సరైన జోడి అని చెప్పారు. మొదట్లో పెళ్లి అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని.. కానీ నయనికను కలిసిన తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ పెరిగినట్టు చెప్పారు. ఇప్పటి దాకా ఎక్కడకు వెళ్లినా తనకు మాత్రమే బిల్ కట్టేవాడినని.. ఇప్పుడు ఇద్దరికి కట్టాలంటూ చెప్పుకొచ్చారు.

‘మా అన్నయ్య అల్లు అర్జున్ (Allu Arjun) ఇచ్చిన సలహాతో పెళ్లిని హ్యాపీగా చేసుకున్నాను. పెళ్లిలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. వాటన్నింటినీ పట్టించుకోకు. ఎంజాయ్ చెయ్ అని అన్నయ్య చెప్పాడు. నా లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ క్షణాలను అన్నయ్య సలహా వల్లే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నా పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను బన్నీ అన్న దగ్గరుండి చూసుకున్నాడు. అందరికంటే ముందే అక్కడకు వెళ్లి.. అందరూ వచ్చేశాక అన్నీ సెటిల్ చేసి వచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు శిరీష్ (Allu Sirish).

Read Also: కంటి చూపును నేచురల్‌గా ఇంప్రూవ్ చేసే చిట్కాలు !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>