కలం, నిర్మల్ : మామడ (Mamda) మండలం రాయదారి గ్రామ సమీపంలో రహదారిపై కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లింగాపూర్ తండాకు చెందిన బాణావత్ అంబాజీ సోమవారం రాత్రి బైక్పై మామడ వైపు వెళ్తుండగా రాయదారి గ్రామ సమీపంలో రహదారిపైకి కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సురేష్, పైలెట్ విజయ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

