భూ తగాదాలో కొడవళ్లతో దాడి.. ఎక్కడంటే!

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల కారణంగా కొత్తగూడ (Kothaguda) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్దబోయిన భాస్కర్ (35)పై ముగ్గురు వ్యక్తులు కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

తన ఇంటి వెనుకాల ఉన్న భూమిలోకి పొరుగింటి నీళ్లు వస్తుండటంతో అడ్డుకట్ట వేసినట్లు భాస్కర్ వివరించారు. కట్టను ఎందుకు తొలగించారని ప్రశ్నించినందుకు మద్దెల నర్సయ్య, మద్దెల అశోక్, వీసం బుచ్చమ్మ తనపై కొడవళ్లతో విచక్షణరహితంగా దాడి చేశారని బాధితుడు వెల్లడించారు. ఈ స్థలం విషయమై కోర్టులో కేసు వేశానని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష పెంచుకుని దాడి చేసినట్లు తెలిపారు. నిందితుల వివరాలపై కొత్తగూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read : 40 ఏళ్ల ఉద్యమానికి ముగింపు.. మావోయిస్టు సమత సరెండర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>