కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Telangana SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. సర్ ప్రక్రియలో దాదాపు 73.53 లక్షల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. 33 జిల్లాల్లోనూ 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైనట్లు వెల్లడైంది.
సర్ ప్రక్రియలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ ( 90.54 శాతం), సూర్యాపేట ( 90.43 శాతం) ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో మాత్రం 60 శాతం కూడా డిజిటలైజేషన్ దాటకపోవడం గమనార్హం. 58.58 శాతంతో డిజిటలైజేషన్ పూర్తై హైదరాబాద్ చిట్ట చివరి స్థానంలో నిలిచింది. రెండుసార్లు గడువు పెంచిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం పెరగలేదు.

