కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో (Delhi) ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ చేరుకున్న మమతా ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బంగా భవన్ వెలుపల భారీగా పోలీసులను మోహరించడంపై ఆమె మండిపడ్డారు. తాము అధికారికంగా అనుమతి తీసుకుని వచ్చామని, నేరస్తుల్లా తమ గదులను తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో పేలుళ్లు జరిగినప్పుడు కనిపించని పోలీసులు, తాము వస్తే మాత్రం ఇంతగా భయపడుతున్నారని పేర్కొన్నారు.
ఓటరు జాబితా నుండి లక్షలాది మంది అర్హులైన వారి పేర్లను తొలగించారని, దాదాపు 150 మంది చనిపోయినట్లుగా తప్పుడు సమాచారం సృష్టించారని ఆమె ఆరోపించారు. మృతి చెందినట్లు ప్రకటించబడిన 50 మందిని తాము ప్రత్యక్షంగా ఇక్కడికి తీసుకువచ్చామని, వారి హక్కులను కాలరాయడం అన్యాయమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ (Feudal System) నడుస్తోందని, సామాన్యుల పట్ల పోలీసులు సున్నితంగా ఉండటం లేదని విమర్శించారు. తాము కోరుకుంటే లక్షలాది మందిని తీసుకురాగలమని, కానీ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి వచ్చామని మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు.
Read Also: లోక్‌సభను తాకిన ‘ఎప్స్టీన్’ సెగ
Follow Us On: Pinterest


