కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాది సంక్రాంతికి ” మన శంకర వరప్రసాద్ గారు ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ (BOBBY) డైరక్షన్ లో చేస్తున్నాడు. బాబీ గతంలో చిరూతో “వాల్తేరు వీరయ్య ” వంటి సూపర్ హిట్ సినిమా చేశారు. తాజాగా ఈ కాంబో మళ్ళీ కలవడంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మోహన్ లాల్ పాత్ర కథను మలుపు తిప్పనున్నట్లు సమాచారం. బిగ్గెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.


