ఇంధన కొరతపై దేవినేని అవినాశ్ వినూత్ననిరసన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు నిరసనగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ప్రజలకు ఇంధనం సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ పలుచోట్ల వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ (Devineni Avinash) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆటోను తాడుతో లాక్కుంటూ రోడ్డుపై ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే  దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్డులోని ఒక పెట్రోల్ బంకు వద్ద నిరసన చేపట్టి, పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ (Devineni Avinash)  మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతకాని ప్రభుత్వమని, ప్రజలకు కనీస అవసరమైన పెట్రోల్, డీజిల్ కూడా అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>