Mobile Popup Ad
Mobile Popup Ad

నెల్లికుదురులో మొక్కజొన్న రైతుల ధర్నా!

కలం, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రం తెరిచి నెల రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులలో కాంటాలు వేసినా కొనుగోలు చేయడం లేదని ఆందోళన చేస్తూ మహబూబాబాద్ – తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని, మళ్లీ వర్షాలు వస్తే తీవ్ర స్థాయిలో తాము నష్టపోతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను పరిస్థితులను అదుపు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>