రేపు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్.. సీఎం రేవంత్ వ్యూహమిదే!

కలం, వెబ్ డెస్క్: రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.3.26 లక్షల కోట్లు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 9:30కి కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమయంలోనే బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలుపనుంది. అనంతరం అసెంబ్లీలో 12:00 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

సంక్షేమం, వ్యవసాయం, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆరోగ్యం, రహదారులు, మున్సిపల్, ఐటీకి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ విజన్ 2047 అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కూడా ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

Read Also: ఘనంగా గద్దర్ అవార్డుల వేడుక.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>