కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) విమానప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలు ప్రకటించింది. జనవరి 28న (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా సెలవు డిక్లేర్ చేసింది. సంతాప సూచకంగా జాతీయ జెండాను జనవరి 28, 2026 నుంచి 30, 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా Half-mast (హాఫ్ మాస్ట్) సగం వరకు ఎగరవేయనున్నారు.
సంతాప దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. బుధవారం రాష్ట్రంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసేశారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ, గవర్నర్ సెక్రటరీ, అన్ని డివిజనల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు మరియు ఇతర అధికారులకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అండర్ సెక్రటరీకి ఆదేశాలు అందాయి.

Read Also: దాదా అజిత్ పవార్.. ఎప్పటికీ గుర్తుండిపోతారు : పవన్ కల్యాణ్
Follow Us On: Pinterest


