ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు మహార్ కులస్తుల సన్మానం

కలం, ఖానాపూర్: మహార్ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సరళతరం చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ (MLA Vedma Bhojju)ను మహార్ కులస్తులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రాలు ఆర్డీఓ స్థాయిలో జారీ అవుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మండల స్థాయిలోనే తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

కుల ధ్రువీకరణ పత్రాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, ప్రక్రియను సులభతరం చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేసిన చొరవ పట్ల మహార్ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>