ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) జోస్యం చెప్పారు. శుక్రవారం మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడేండ్లుగా అధికారంలో ఉండి యువతకు, ఉద్యోగులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశానిస్పృహలు ఉన్నాయని ఆయన విమర్శించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ప్రస్తుత ఎన్నికల కోసం మళ్లీ కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందర్నీ గుర్తించి, నవంబర్‌ 6 నాటికి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా ప్రత్యేక చొరవ చూపి సహకరించాలని కార్యకర్తలను కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వడం లేదని, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇవ్వడం లేదనే విషయాలను వారికీ అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు.

మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. ఎవరికి వారు వారి ఇండ్లలో ఉన్న పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్‌న‌గ‌ర్‌ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ నరేందర్, సీనియర్ నాయకులు మధుమోహన్, శ్రీశైలం, నవకాంత్, సిద్ధిఖీ, ఖలీం, రమేష్ నాయక్, రవికిషన్ రెడ్డి, జంబులయ్య, చెన్నయ్య, శ్రీనివాస్, అహ్మదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>