Mobile Popup Ad
Mobile Popup Ad

‘బీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ చేస్తోంది’

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని మహబూబ్‌నగర్ (Mahabubnagar)  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామనలేదా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని సోనియాగాంధీకి చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న హామీ నిజం కాదా? అంటూ మండిపడ్డారు. పదేళ్లలో మీ ప్రభుత్వం చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా చేస్తుంటే మీకు ఎందుకు కడుపు మంట అంటూ ఆయన బీఆర్ఎస్ నేతలు నిలదీశారు.

ప్రాజెక్టుల విషయంలో కలిసి రావాలి

పాలమూరు ప్రాజెక్టుల విషయంలో అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తే కావాలనే బీఆర్ఎస్ నేతలు రాద్దాంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకొని ఇంతకాలం కాలయాపన చేసింది ఎవరో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కుర్చీ వేసుకుని పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వం చేస్తే ప్రజలు క్షమించరనే ఉద్దేశంతోనే క్షేత్రస్థాయి సందర్శన చేపట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జహీర్ అక్బర్, రాములు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>