పాము కాటుకు గురైన విద్యార్థికి వైద్యం అందించాలి: అదనపు కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాము కాటుకు గురైన విద్యార్థికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Mahabubnagar Additional Collector) వైద్యులను ఆదేశించారు. దేవరకద్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాల (THSWRS/JC)లో పాము కాటుకు గురైన విద్యార్థి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.

విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను సమీక్షించారు. విద్యార్థి చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు అదనపు కలెక్టర్‌కు తెలిపారు. విద్యార్థిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.

Also Read : అంజనగిరి పాఠశాలలో విద్యార్థులతో మమేకమైన నిరంజన్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>