కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఆటగాడు, బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (Abishek Porel)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక వైద్య విద్యార్థిని నమోదు చేసిన అత్యాచారం కేసులో హుగ్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి చిన్సురా కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2023లో పోరెల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా పెళ్లి చర్చల వరకు వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు బాధితురాలు తెలిపింది.
అయితే, 2026 ఏప్రిల్ 2న ఢిల్లీలో తనపై దాడి చేసి, గదిలో బంధించారని ఆమె ఆరోపించింది. తిండి కూడా పెట్టకపోవడంతో తనకు వైద్య సహాయం అవసరమైందని పేర్కొంది. అంతేకాకుండా, తమ వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి, బయటపెడతానని బెదిరించినట్లు మొగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ సౌగత భట్టాచార్య, జులై 14న పోరెల్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
డిజిటల్ ఆధారాలు బయటకు రాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీసులు పోరెల్‌ను అరెస్ట్ చేశారు. 23 ఏళ్ల అభిషేక్ పోరెల్ (Abishek Porel) బెంగాల్ రంజీ జట్టులోనూ, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఈ ఆరోపణలను పోరెల్ గతంలోనే ఖండించాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలోనే ఉంది. న్యాయస్థాన విచారణలోనే నిజానిజాలు తేలాల్సి ఉంది.
Also Read : మాజీ క్రికెట్ కెప్టెన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు
Follow Us On : WhatsApp

