ద‌స‌రా ల‌క్కీ డ్రా.. కిక్ ఎక్కిస్తున్న బ‌హుమ‌తులు!

క‌లం, మ‌హ‌బూబాబాద్: తెలంగాణ‌లో ద‌స‌రా (Dasara) సంద‌డి మొద‌లైపోయింది. ఇప్ప‌టికే గ్రామాల్లో దేవీ న‌వ‌రాత్రుల‌కు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. పిల్ల‌ల‌కు రేప‌టి నుంచి సెల‌వులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక షాపింగులు, బ‌తుక‌మ్మ‌ల సంద‌డి కూడా జోరుగా సాగ‌నుంది. అక్టోబ‌ర్ 20న ద‌స‌రా పండుగ జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని ఓ గ్రామంలో రెగ్యుల‌ర్ సంబ‌రాల‌కు తోడుగా వినూత్నంగా ఓ ద‌స‌రా ల‌క్కీ డ్రా (Dasara Lucky Draw) నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే నిర్వాహ‌కులు ఈ ల‌క్కీ డ్రాకు సంబంధించిన బ‌హుమ‌తుల‌ను కూడా ప్ర‌క‌టించారు. కేవ‌లం వంద రూపాయ‌ల‌తో టికెట్ కొంటే ‘పండుగ’ చేసుకోవ‌చ్చంటూ ప్ర‌జ‌ల‌ను అట్రాక్ట్ చేస్తున్నారు.

ఇక ల‌క్కీ డ్రాలో ప్ర‌క‌టించిన బ‌హుమ‌తులు చూస్తే ఎవ‌రికైనా దిమ్మ‌దిరిగిపోవాల్సిందే. సాధార‌ణంగా ల‌క్కీ డ్రాలు అంటే న‌గ‌దు బ‌హుమ‌తి, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, కూల‌ర్లు, బైక్‌లు ఉంటాయి. కానీ, ఇక్క‌డ ల‌క్కీ డ్రా చాలా స్పెష‌ల్‌. పండుగ పూట మందుకు, విందుకు ఏమాత్రం లోటు రాకుండా నిర్వాహ‌కులు వినూత్న బ‌హుమ‌తులు ప్ర‌క‌టించారు. లిక్క‌ర్ బాటిళ్లు, కోళ్లు, పొట్టేలుతో డిఫ‌రెంట్ గిఫ్ట్స్ ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనాలంటే ముందుగా రూ.100 పెట్టి టికెట్ కొనుగోలు చేయాలి. మొద‌టి బ‌హుమ‌తి గెలుచుకున్న వారికి 10 కిలోల పొట్టేలును ఇవ్వ‌నున్నారు, రెండో బ‌హుమ‌తిగా 5 నాటు కోడి పుంజులు ఇస్తారు. మూడో బహుమతిగా బీర్ల కేస్‌, నాలుగో బహుమతిగా రెండు నాటుకోళ్లు, ఒక‌ ఫుల్ బాటిల్ మ‌ద్యం, ఐదో బ‌హుమ‌తిగా ఫుల్ బాటిల్ అందించ‌నున్నారు. ఈ లక్కీడ్రా స్థానికంగా చ‌ర్చ‌నీయంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>