కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోకస్ పెట్టారు. ఈ మేరకు 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సాధారణం కంటే రాష్ట్రంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సుమారు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
కరువు మండలాలను ప్రకటించడంతో పాటు సుమారు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ఎల్ నినో అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టుపై సమీక్షించబోతున్నారు.

