ఒక స్వీట్ బాక్స్ అడిగితే.. ఏకంగా 70 కోట్ల యుద్ధ ట్యాంక్ ఆర్డర్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని మదురైకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీరమణి (Veeramani Madurai)కి సోషల్ మీడియా వేదికగా ఊహించని వింత అనుభవం ఎదురైంది. రాబోయే పండుగను పురస్కరించుకుని తనకు ఎవరైనా స్వీట్ బాక్స్ బహుమతిగా పంపాలని కోరుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు తనకు స్వీట్లు కొరియర్ చేయడానికి వీలుగా ఆ వీడియోలోనే తన ఇంటి పూర్తి చిరునామాతో పాటు సొంత ఫోన్ నంబర్‌ను కూడా పంచుకున్నారు.

మొదట్లో కొందరు నెటిజన్లు ఆయన కోరినట్లే అభిమానంతో స్వీట్లు పంపించారు. అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. కొందరు నెటిజన్లు క్యాష్ ఆన్ డెలివరీ (COD) పద్ధతిలో రకరకాల ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేయడం ప్రారంభించారు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్లతో పాటు చివరకు రూ.1.69 లక్షల విలువైన టీవీని కూడా ఆయన పేరిట ఆర్డర్ పెట్టి పంపించారు.

అంతటితో ఆగకుండా ఒక నెటిజన్ ఏకంగా రూ.70 కోట్ల విలువైన మిలిటరీ యుద్ధ ట్యాంక్‌ను కూడా COD పద్ధతిలో ఆర్డర్ చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. వరుసగా ఇంటికి వస్తున్న డెలివరీ బోయ్స్, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వీరమణి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. దయచేసి తన అడ్రస్‌పై ఎలాంటి ఆర్డర్లు పెట్టొద్దని, డెలివరీ బాయ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని వేడుకుంటూ ఆయన మరో వీడియో పోస్ట్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆర్డర్ల గోల తట్టుకోలేక, నెటిజన్ల వేధింపులను భరించలేక చివరకు వీరమణి తన ప్రస్తుత ఇంటిని ఖాళీ చేసి మరో చోటికి పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>