Mobile Popup Ad
Mobile Popup Ad

కీలక ప్రతిపాదన.. దేశంలో భారీగా పెరగనున్న ఎంపీ సీట్లు!

కలం, వెబ్ డెస్క్ : దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన చేసింది. కేవలం జనాభాను మాత్రమే ప్రాదిపదికగా తీసుకోకుండా పట్టణీకరణ, ఎస్సీ-ఎస్టీ జనాభా, భాషాపరమైన వైవిధ్యం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోని కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానాలను రెట్టింపు చేయాలన్న ఆర్థిక సలహా మండలి.. పెద్ద రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లను 50 శాతం పెంచాలని మోడల్ రూపొందించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎంపీ స్థానాలు భారీగా పెంచాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య శాతం ప్రస్తుతం ఉన్న 23.7 శాతం స్థాయిలో కొనసాగేలా ప్రతిపాదనలు రూపొందించింది. 2027 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, తాజా ప్రతిపాదనలు అమలైతే వాటి సంఖ్య 824కు చేరే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అదనపు లోక్‌సభ స్థానాలు లభించనున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>