కలం, డెస్క్ : లోక్ సభను (Lok Sabha) స్పీకర్ ఓంబిర్లా రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలతో సభలో గందరగోళం నెలకొంది. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నవరణే రాసిన పుస్తకంలో చైనా సైన్యం భారత్ లోకి చొరబడుతోందని రాసి ఉందని.. దానిపై రాహుల్ ప్రశ్నించగా.. బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అసలు ప్రచురణే కాని పుస్తకం గురించి రాహుల్ ఎలా మాట్లాడుతారంటూ హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఇలా అధికార, విపక్షాల వాదనలతో సభలో గందరగోళం నడుమ స్పీకర్ ఓంబిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.
Read Also: ఢిల్లీలో ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోంది: మమతా బెనర్జీ
Follow Us On: X(Twitter)


