కలం, వెబ్ డెస్క్ : వన్ ఫైట్ నైట్ 43లో అభిమానులను షాక్‌కు గురిచేసే అద్భుత ఫైట్ చోటుచేసుకుంది. ఫిలిప్పీన్స్ ఫైటర్ లిటో అదివాంగ్ (Lito Adiwang) కేవలం 34 సెకన్‌లలో తన ప్రత్యర్థి ఇండోనేషియా ఫైటర్ ఎకో రోని సపుత్ర (Eko Roni Saputra) పై బాంటమ్‌వెయిట్ ఎంఎంఏ బౌట్‌లో టెక్నికల్ నాకౌట్ (TKO) విజయం సాధించాడు. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే అదివాంగ్ దూకుడుగా దాడులు ప్రారంభించి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పంచ్‌లతో ఒత్తిడి పెంచిన అతను తొలి రౌండ్ 34వ సెకనులోనే రిఫరీ ఫైట్‌ను ఆపేలా చేశాడు. ఈ విజయం ద్వారా అతని రికార్డు 18-6కు చేరింది.
ఈ విజయంతో ఆదివాంగ్ మళ్లీ టైటిల్ రేసులో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రస్తుతం అతను బాంటమ్‌వెయిట్‌లో ఉన్నప్పటికీ, తన అసలు లక్ష్యం ఫ్లైవెయిట్ డివిజన్‌లో కొనసాగడమేనని స్పష్టం చేశాడు. తదుపరి పోరులో చైనా ఫైటర్ హు యోంగ్‌తో తలపడాలని ఆసక్తి వ్యక్తం చేశాడు. ఫ్లైవెయిట్ విభాగంలో హు యోంగ్ ఇప్పటికే ప్రమాదకర ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డానీ కింగడ్ (Danny Kingad), గెజె యూస్టాక్వియో (Geje Eustaquio)పై తొలి రౌండ్ నాకౌట్ విజయాలు సాధించి తన బలం చూపించాడు. ఇప్పుడు అదివాంగ్ కూడా అతనిపై కన్నేయడంతో ఈ ఫైట్‌పై ఆసక్తి పెరుగుతోంది. అదే ఈవెంట్‌లో సోమా ఫైట్ క్లబ్‌కు చెందిన బెన్ వూలిస్ కూడా బరిలోకి దిగగా, మాజీ ప్రపంచ ఛాంపియన్ పెట్చటనాంగ్ పెచ్‌ఫెర్గస్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ ఈ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అదివాంగ్ అభిప్రాయపడ్డాడు.

