కరీంనగర్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

కలం, కరీంనగర్ బ్యూరో: జాతీయ ఐక్యతతో పాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం వావిలాలపల్లిలోని గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని (National Unity Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు జాతీయ ఐక్యత, మత సామరస్యం, సోదరభావం ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సందేశంతో బీఎడ్ విద్యార్థులకు పునర్వినియోగ వస్త్ర సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్, బట్టు వినోద్, కె. చైతన్య, సింగమ రాజు, ఐత సూరజ్, కోల అన్నారెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>