గ్రంథాలయ వారోత్సవాల ముగింపు.. విద్యార్థులకు బహుమతులు

కలం, నిర్మల్: గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల (Library Week Celebrations) ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో గ్రంథాలయాలను మరింత అభివృద్ధి చేసి, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెండెం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చిన్ను, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>