కలం, నాగార్జునసాగర్: నల్గొండ (Nalgonda) జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మ చెట్టులో తాటి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో చెట్టు ఆకులు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన వచ్చిందని, ఆ సమయంలోనే తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగినట్లు తెలిపారు.
ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కానీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుపక్కల పశువుల కాపరులు, రైతులు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చర్చించుకుంటున్నారు.
Read Also: భారీ శుభవార్త.. నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో నియామక పత్రాలు
Follow Us On: Instagram

