Mobile Popup Ad
Mobile Popup Ad

ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వాడొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే?

కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలామంది ఛార్జింగ్‌లో పెట్టి ల్యాప్ టాప్‌ (Laptop) ను వాడుతుంటారు. ఇలా వాడటం సురక్షితమేనా? చార్జింగ్ లో పెట్టి ల్యాప్ టాప్‌ను వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ (Battery Health) టైమ్ తగ్గుతుంతా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దీని గురించి టెక్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

నేటి కాలంలో ఉద్యోగం, చదువు, వినోదం అన్నీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌‌తోనే ముడిపడి ఉన్నాయి. ఇటు ఇల్లు, అటు ఆఫీసులలో చాలామంది గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఛార్జర్‌కు కనెక్ట్ చేసి వాడుతూనే ఉంటాయి. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఛార్జింగ్‌లో పెట్టి ల్యాప్‌టాప్‌ను వాడినా అది సురక్షితంగానే ఉంటుందట. ఎందుకంటే ఆధునిక ల్యాప్‌టాప్‌లు లిథియం-అయాన్ లేదా లిథియం-పాలిమర్ బ్యాటరీలతో రూపొందిస్తున్నారు. వీటిలో ఉండే ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వల్ల బ్యాటరీ 100 శాతం చేరిన తర్వాత అదనపు ఛార్జింగ్‌ను నియంత్రిస్తుందట. అత్యాధునిక ల్యాప్‌లు దీన్ని దృష్టిలో ఉంచుకునే తయారు చేస్తారు. అందువల్ల ఛార్జింగ్‌లో ఉండగానే ల్యాప్‌టాప్‌ను నిరభ్యంతరంగా వాడుకోవచ్చని చెబుతున్నారు.

కానీ కొన్ని సార్లు ఛార్జింగ్‌లో ఉంచి ల్యాప్‌టాప్‌ను గంటల తరబడి వాడితే.. హీట్ సమస్య ఏర్పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గేమింగ్, వీడియో ఎడిటింగ్, భారీ సాఫ్ట్‌వేర్‌ల వినియోగం వంటి పనులు చేస్తూ ఛార్జింగ్‌లో ఉంచడం వలన ల్యాప్‌టాప్ హీట్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ అధిక వేడి కారణంగా బ్యాటరీ లైఫ్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. అందుకని ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచి ల్యాప్‌టాప్‌లను వాడుకోవద్దని సూచిస్తున్నారు.

ల్యాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ రోజులు బాగుండాలంటే…

ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ రోజులు మిత్రపక్షంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

100% ఛార్జింగ్ వద్దు

బ్యాటరీని ఎప్పుడూ వంద శాతం ఫుల్ ఛార్జ్ చేయకండి. అలాగే 20% కంటే తక్కువకు పడిపోనివ్వకండి. ఛార్జింగ్ ఎప్పుడూ 20% నుండి 80% మధ్య ఉంచడం బ్యాటరీ ఆరోగ్యానికి చాలా మంచిదని సూచితస్తున్నారు.

ఓవర్ ఛార్జింగ్ వద్దు

రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుందట. ఛార్జింగ్ అవ్వగానే ప్లగ్ తీసేయాలని చెబుతున్నారు.

వేడికి దూరంగా ఉంచండి

ల్యాప్ టాప్‌ను ఎల్లప్పుడూ ఫ్లాట్‌గా ఉండే టేబుల్‌పైన పెట్టి వాడాలట. మంచం మీద లేదా సోఫా మీద పెట్టి వాడటం వల్ల కింది వైపు గాలి ఆడక ల్యాప్ టాప్ వేడెక్కుతుందని చెబుతున్నారు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

ఒరిజినల్ ఛార్జరే వాడండి

లోకట్ ఛార్జర్లు వాడటం వలన బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ లేదా బ్రాండెడ్ ఛార్జర్ మాత్రమే వాడాలి.

స్లీప్ మోడ్ వాడండి

ల్యాప్‌టాప్ వాడనప్పుడు స్క్రీన్ ఆన్ లో ఉంచకుండా లాక్ చేయడం లేదా స్లీప్ మోడ్‌లో పెట్టడం వల్ల అనవసర బ్యాటరీ డ్రెయిన్ తగ్గుతుందని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించడం వలన ల్యాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేస్తుందని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>