అల్పాహార పథకానికి కవ్వంపల్లి శ్రీకారం

కలం, శంకరపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు హాజరు శాతాన్ని పెంపొందించేందుకు దోహదపడుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం (Keshavapatnam) గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం రుచికరమైన, నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు పోషకాహారం అందడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని, పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

మిల్లెట్, రాగిజావ, పాలు తీసుకోవడం వల్ల రక్తహీనత, బలహీనత తగ్గుతాయని అన్నారు. పాఠశాల పనిదినాల్లో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు ఈ అల్పాహార పథకం వరంలాంటిదని పేర్కొన్నారు. పిల్లల కోసం ఇళ్లల్లో టిఫిన్ తయారు చేసే శ్రమ తగ్గడంతో పాటు తల్లిదండ్రులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హరే కృష్ణ మూవ్‌మెంట్ (అక్షయ పాత్ర) బృందానికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మచ్చ గీత, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాశ్, ఎంపీడీవో అనిత, తహసీల్దార్ సురేఖ, పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి, తాడికల్, గద్దపాక, మెట్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్లు కీసర సంపత్, గోపగోని బస్వయ్య గౌడ్, గాజుల మహేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, పార్టీ నాయకులు గట్టు తిరుపతి, ఉప్పుగళ్ల మల్లారెడ్డి, గొట్టె మధు, మధుకర్, చింతిరెడ్డి పద్మ, కవ్వ పద్మ, జనగామ రాజయ్య, షారుఖ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>