కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి (Kukutlapally) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు (Students) వర్షాభావ పరిస్థితులపై స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వరుణదేవుని కరుణ కోసం, రైతన్నల కష్టాలు తీరాలంటూ విద్యార్థులు చేపట్టిన వినూత్న పూజలు, ప్రార్థనలు, పాటల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంప్రదాయ పద్ధతిలో కప్పకు అభిషేకం, వర్షాలు పడక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలోని చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి, సంప్రదాయ ఆచారాల ప్రకారం కప్పను వేపాకులతో అలంకరించి నీటితో ప్రత్యేక అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పొలాల్లో నిలబడి “చినుకమ్మ ఓ చినుకమ్మ… ఒక్కసారి వచ్చి నేల తడిపిపోవమ్మా” అంటూ ఆలపించిన పాట, చేసిన నృత్యం, వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులు నిండి, రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు విరియాలి” అని కోరుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయత్నం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. పిల్లల్లో వ్యవసాయం పట్ల అవగాహన, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులను, విద్యార్థులను పలువురు అభినందించారు.
వర్షాల కోసం స్కూల్ పిల్లల వినూత్న వేడుకోలు
-వరుణదేవుని కరుణ కోసం విద్యార్థులు వినూత్న పూజలు, ప్రార్థనలు, పాటలు
-ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రయత్నం
-దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Students of Primary School in Medak Perform Unique… pic.twitter.com/8ORMsSVqrs— Kalam Daily (@kalamtelugu) July 21, 2026
Read Also: విచిత్ర ఘటన.. శివలింగంపై పోసిన నూనె పాలుగా మార్పు..!
Follow Us On : WhatsApp

